కడియం శ్రీహరి ఇంటి ముందు మాదిగలం చావు డప్పు కొడతామని… కడియం శ్రీహరి అనే వాడు మాదిగ ద్రోహి అని ఫైర్ అయ్యారు రసమయి బాలకిషన్. వరంగల్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని రసమయి బాలకిషన్ కామెంట్ చేశారు. తెలంగాణ భవన్ లో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… ఆట పాటల వల్ల తెలంగాణ రాలేదు అని కె.కేశవరావు అన్నారు…ఆ మాటలు వెనక్కి కేకే వెనక్కి తీసుకోవాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ అమరవీరులస్థూపం వద్దకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంను అవమానించడం దారుణమన్నారు.
పాట లేకుంటే లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు రసమయి బాలకిషన్. ముసలితనం కు వచ్చిన కేకే మతి భ్రమించి మాట్లాడు తున్నారు…కాంగ్రెస్ లో పట్టించుకోని కేకే కు brs లో ఎన్నో పదవులు ఇచ్చారు కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు రసమయి బాలకిషన్. కడియం శ్రీహరి కి ఏమి తక్కువ చేశాము అని పార్టీ మారిపోయారు….కడియం శ్రీహరి ని రాజకీయంగా బొంద పెట్టడానికి వరంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్ల విషయం లో అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు రసమయి బాలకిషన్. మాదిగలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చావు డప్పు కొడతామని హెచ్చరించారు రసమయి బాలకిషన్.