కాంగ్రెస్ కు ఓటు వేస్తే గొర్రె కసాయివాడిని నమ్మినట్టేనని చురకలు అంటించారు మాజీ మంత్రి హరీష్ రావు. పాపన్నపేటలో జరిగిన మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు…అనంతరం మాట్లాడారు. మన పార్టీ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యం.. విభేదాలు పక్కన పెట్టాలి.. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టాలని… ప్రజల కోసం కష్టపడే మన అభ్యర్థి వెంకట్రాం రెడ్డిని గెలిపించాలని కోరారు.
మెదక్‌ను జిల్లా కేంద్రం చేసి.. మెదక్‌కు రైలును, మెడికల్ కాలేజీని తెచ్చింది కేసీఆర్ అని.. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ శాంక్షన్ చేసిన వంద కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వాపసు తీసుకుంది.. అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ఏంటి? అని నిలదీశారు. ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు… బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు.
నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేటు ముంచిన్రని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న రూ 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదు.. బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి.. రైతులు కష్టాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతల రాయుడు రేవంత్ వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి రూ. 2500కు కొంటానన్నాడు.. యాసంగి వడ్లకన్నా ఇవ్వాలి కదా అని నిలదీశారు.