కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఓబిసి జాతి అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో రైతు సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కే లక్ష్షణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలని అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు.
ఆరు గ్యారెంటీ లతో పాటుగా 46 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అమలు చేయట్లేదని అన్నారు. ఎన్నికల్లో గెలవగానే రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ దానిని నెరవేర్చలేదని చెప్పారు రైతులకి రైతు భరోసా కింద 15000 ఇస్తామని రైతు కూలీలకి కౌలు రైతులకి 12,000 ఇస్తామని ప్రకటించి ఇప్పటిదాకా ఆ ఊసే తెలవట్లేదు అని అన్నారు.