నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం

-

Bharatiya Janata Party: ఇవాళ బీజేపీ పార్టీ సంస్థాపన దినోత్సవం. ఈ తరుణంలోనే బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సంస్థాపన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇక కార్యక్రమానికి బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, బిజెపి నేతలు హాజరయ్యారు.

అటు విజయవాడలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి సిద్దార్ధ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరిస్తారు పురందేశ్వరి.

 

Read more RELATED
Recommended to you

Latest news