తెలుగు రాష్ట్రాల్లో మాంసప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సండే వచ్చిందంటే చాలు చికెన్ ముక్క లేదా మటన్ బొక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు ఉంది వ్యవహారం.దీంతో గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పెరిగిన చికెన్ ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు షాక్ అవుతున్నారు.
విజయవాడలో కేజీ రూ.310, హైదరాబాద్లో కేజీ రూ.300 ధర పలుకుతోంది. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.100 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఎండలు ముదురుతుండటంతో కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో వాటి లభ్యత తక్కువగా ఉంది.కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని, దీంతో ధరలు పెరిగిపోతున్నాయి వ్యాపారులు చెబుతున్నారు.ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చికెన్, మటన్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చికెన్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కోడి మాంసం కొనుగోలు పరిమాణాన్ని తగ్గిస్తున్నారు.