త్వరలోనే జనసేన పార్టీ భూస్థాపితం కాబోతుందని బాంబ్ పేల్చారు పోతిన మహేష్. ఇవాళ పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడారు. జనసేన పార్టీకి రాజీనామా ఆవేశంలో చేయలేదు…సీటు రాలేదని నేను రాజీనామా చేయటం లేదన్నారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేసామని వెల్లడించారు.
2014లో పోటీ చేయక పోయినా, 2019లో ఒక సీటు వచ్చినా పవన్ తో నడిచి మేం భంగ పడ్డామన్నారు. నటించే వాడు నాయ కుడు అవలేడు..నమ్మకం కలిగించే వాడు మాత్రమే నాయకుడు అని చురకలు అంటించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్… ఇలాంటి పాషాన హృదయం కలిగిన వ్యక్తితో ప్రయాణం చేసిన మాకు మాపై అసహ్యం కలుగుతోందని ఫైర్ అయ్యారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఎప్పుడు పవన్ దృష్టి పెట్టలేదు…పవన్ ది అంతా నటనే..అన్నీ తాత్కాలికమేనన్నారు. పవన్ ను నమ్మి నెట్టేట మునిగిపోయామని చెప్పారు పోతిన మహేష్.