Shakeel: కేసులో నుంచి ఒకరిని తప్పించబోయి 15 మంది బలి అయ్యారు. అవును బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కోసం 15 మంది బలి అయ్యారు. ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. కాగా, ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్‌కి పారిపోయిన రహీల్ నిన్న తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.