గాజాలో మానవతా సంక్షోభాన్ని ఆమోదించలేం: ఐరాసలో భారత్‌

-

ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణహోమం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గాజాలో ప్రస్తుత పరిస్థితులపై ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపం దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. . ఈ నేపథ్యంలో గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని భారత్‌ స్వాగతించింది. దీన్ని ఒక సానుకూల చర్యగా అభివర్ణిస్తూ.. ఇజ్రాయెల్-హమాస్ వివాదం ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

గాజాలో కొనసాగుతున్న ఘర్షణతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభం చాలా తీవ్రమైందని, దీని వల్ల ఆ ప్రాంతంతో పాటు వెలుపల కూడా అస్థిరత పెరుగుతోందని అన్నారు. ఈ ఘర్షణ వల్ల పెద్ద ఎత్తున సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారన్న కాంబోజ్.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు బాధితులుగా మారారని పేర్కొన్నారు. దీన్ని భారత్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించినట్లు గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news