BREAKING: సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్

-

BREAKING: సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్ అయ్యారు. రెండ్రోజుల క్రితం మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్నారట 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొండడంతో ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

106 government employees suspended in Siddipet district

ఈ తరుణంలోనే.. వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సమావేశంలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. అటు ఇప్పటికే మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news