KCR: కేసీఆర్ జాతకంలో కొత్త దోషం ఉందట. ఈ విషయాన్ని తాజాగా పండితులు చెప్పారు. తెలంగాణ భవన్ పంచాంగ శ్రవణం ప్రకారం.. కేసీఆర్ రాశి (కర్కాటకం) అత్యంత సంతోషకరంగా ఆదాయ, వ్యయాలు కనిపిస్తున్నాయని పండితులు వివరించారు. అన్ని వ్యవహారాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారట. వారి మాటకు, గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తోందట.
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కేసీఆర్ తీసుకోవాలని చెబుతున్నారు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దట. ఇక కేసీఆర్ దోష నివారణ కోసం లక్ష్మీ మోహన గణపతిని చవితి నాడు దర్శనం చేసుకోవాలని తాజాగా పండితులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర పాలక పక్షంకు ఈ సారి కష్టకాలం ఉందని.. ప్రతి పక్షానికి దిగ్విజయం ఉందని తెలిపారు పండితులు. ఇటీవల భారత దేశంలో గ్రహణాలు కనిపించడం లేదు కనిపిస్తున్నాయి అని భ్రమ పడుతున్నాము….క్రోది నామ సంవత్సరం లో చంద్ర గ్రహణం,సూర్య గ్రహణం కనిపించవని వెల్లడించారు.