సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భూమిపై నుంచి వీక్షించడానికి జనం విపరీతంగా ఆసక్తి చూపారు. మరోవైపు గ్రహణాన్ని ఛేజ్ చేయడానికి నాసా ఏర్పాట్లు కూడా చేసింది. అంతరిక్షం నుంచి భూమిపై గ్రహణం ఎలా కనిపిస్తుందో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహం ఒకటి అరుదైన దృశ్యాలను రికార్డు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అచ్చం భూమికి చుక్క పెట్టినట్లు ఈ వీడియోలో చంద్రుడి నీడ స్పష్టంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చిత్రీకరించారు. దక్షిణ కెనడాపై 260 మైళ్ల ఎత్తులో ఈ కేంద్రం ప్రయాణిస్తుండగా భూమిపై చంద్రుడి నీడ కదులుతూ స్పష్టంగా కనిపిస్తోంది. అది ఏ ప్రాంతానికి చేరితే అక్కడ చీకట్లు అలముకుంటున్నట్లుంది. గ్రహణంలో సంపూర్ణ దశ.. గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగగా.. ఆ సమయంలో చందమామ.. సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే భూమిపై చీకట్లు ఆవరించాయి. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది.
View of the solar eclipse from a Starlink satellite on orbit pic.twitter.com/RAwT2uQUUh
— Starlink (@Starlink) April 8, 2024