ప్రభాస్ సలార్ మూవీ రికార్డ్ సేఫ్ !

-

సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సరికొత్తగా అల్లు అర్జున్ మాస్ గెటప్ అదిరిపోయింది. దీనికి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ తోడైంది.ఈ క్రమంలో పుష్ప-2 టీజర్ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తోందని మూవీ టీమ్ వెల్లడించింది. కేవలం 12 గంటల్లోనే 51 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్, 1 మిలియన్ లైక్స్ సొంతం చేసుకున్నట్లు ట్వీట్ చేసింది. యూట్యూబ్లో నంబర్-1 స్థానంలో ట్రెండింగ్ అవుతున్నట్లు పేర్కొంది.

అయితే పుష్ప 2 ప్రభాస్‌ సలార్ మూవీ టీజర్‌ రికార్డ్‌ను అధిగమించలేకోపోయింది. సలార్‌ టీజర్‌ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్‌ లైక్స్‌ వచ్చాయి. అదే లైక్స్ పుష్ప-2 టీజర్‌కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ మూడవ స్థానంలో ఉంది.కాగా ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news