ఇన్ఫోసిస్‌ దాతృత్వం.. కర్ణాటక పోలీసులకు భారీ విరాళం

-

దేశీయ ఐటీ దిగ్గజాల్లో పలు కంపెనీలు కోట్ల టర్నోవరే కాదు.. కోట్ల విరాళాలు అందజేస్తూ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటాయన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్‌ కూడా ఉంటుంది. ఈ సంస్థ ఇప్పటికే పలువురికి ఉచిత ఉన్నత విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది.

సైబర్‌ నేరాలపై పోరాటంలో భాగంగా బెంగళూరు పోలీసులకు భారీ విరాళాన్ని అందజేసింది ఇన్ఫోసిస్. కర్ణాటక పోలీసుల సైబర్‌ నేరాల దర్యాప్తు సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రూ.33 కోట్ల విరాళం అందించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) విభాగం వెల్లడించింది. ఈ మేరకు బెంగళూరులోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో సెంటర్‌ ఫర్‌ సైబర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చి సహకారాన్ని పునరుద్ధరించేందుకు వీలుగా సీఐడీ, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో చేసుకున్న ఎంఓయూపై సంతకాలు చేసినట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఈ అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించడం ద్వారా సైబర్‌ నేరాల దర్యాప్తు సామర్థ్యం బలోపేతమవుతుందని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news