చంద్రబాబు సీఎం కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలేరు : అంబటి రాంబాబు

-

రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టడంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శ, ప్రతివిమర్శలతో తగ్గేది లే అంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ…వాలంటీర్లకు 10వేలు ఇస్తానని అనటం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ స్టంట్ లో భాగమేనని విమర్శించారు. ఈ దేశంలో చంద్రబాబు మాట ఎవరూ నమ్మరని అన్నారు. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని అన్నారు. నిన్నటి దాకా వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news