విద్యలో ఏపీ ప్రభుత్వం వండర్.. టోఫిల్ పరీక్షకు లక్ష మంది హాజరు..

-

విద్యను ఏపీ ప్రభుత్వం వండర్ క్రియేట్ చేస్తుంది.. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. గత ప్రభుత్వాలు చేయలేని సాహసాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు.. ప్రభుత్వ స్కూల్లో రూపు రేఖలు మార్చి అందులో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వానికి తిరుగులేదు అనేలా నూతన సంస్కరణలు తీసుకొచ్చారు.. ప్రతిపక్షాలు అడ్డు తగిలిన నాడు నేడు ద్వారా వేలాది పాఠశాలకు మహర్దశ తీసుకొచ్చి.. ఆంగ్ల మాధ్యమాన్ని నిరుపేద విద్యార్థికి సైతం దగ్గర చేశారు.. టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ.. ప్రభుత్వ స్కూల్లో చదివే నిరుపేద పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు.. ఈ క్రమంలో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశాలలోనూ ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది..

Ys-Jaganmohan-Reddy

ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చెందాయి.. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే టోఫిల్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చూపించారు.. ఏపీలోనే 13,104 స్కూల్స్ లో 3,4,5 చదువుతున్న సుమారు 4,53,265 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.. తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు 5907 స్కూల్స్ నుంచి 6,7,8,9 తరగతులు చదువుతున్న విద్యార్థులు హాజరవుతారు.. ఏప్రిల్ 12 నిర్వహించే పరీక్షకు 16.5 లక్షల మంది పిల్లలు హాజరవుతారని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.. ఏపీ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ప్రతి నిరుపేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ ప్రభుత్వం పడుతున్న తపనను అన్ని రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకునేలా ప్రభుత్వం శ్రమిస్తోంది..

గత ప్రభుత్వం రేషనైజేషన్ పేరుతో స్కూల్స్ ను మూత వేసి… ఉపాధ్యాయులను కుదించి వేసింది.. కానీ సీఎం జగన్ మాత్రం విద్యావ్యవస్థకు పెద్దపీట వేశారు.. ఆయన తీసుకున్న సంస్కరణల ఫలితంగానే విద్యార్థుల ప్రతిభ దేశ విదేశాలకు తెలుస్తోందని విద్యా పండితులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news