బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇప్పుడు టాపర్గా నిలిచింది ఓ బాలిక. ఈ సంఘటన కర్నూలులో జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంకి చెందిన ఎస్. నిర్మల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి చిన్నతనంలోనే వివాహం చేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో వివాహం నుంచి తప్పించుకోగా జిల్లా యంత్రాంగం రక్షించి ఆలూరు కేజీబీవీలో చేర్పించారు.
ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది.ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.