ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ , కుమార్తె మీసా భారతికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.రాజ్‌నాథ్ బీహార్‌లోని జముయిలో జరిగిన పార్టీ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జైలులో ఉన్నవాళ్లు, బెయిలుపై బయటకు వచ్చిన వాళ్లు ప్రధాని మోదీని జైలుకు పంపతామని అంటున్నారని మిసా భారతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేతలు కొందరు నవరాత్రి సీజన్‌లో ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు నాన్‌వెజిటేరియన్ విజువల్స్ పోస్టింగ్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మీరు (తేజస్వి) నవరాత్రి సీజన్‌లో చేపలు తిన్నారు. వాటిని పోస్ట్ చేయడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు? చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏదైనా తినండి? వాటిని అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం చేస్తున్నదే. ఫలానా మతానికి చెందిన వారు ఓట్లు వేస్తారనే ఆలోచనే ఇందుకు కారణం అని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను సరిదిద్దాలని లాలూజీకి విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అవుతున్నారని ప్రపంచమంతా చెబుతోందని వెల్లడించారు.