ఈనెల 18 నుంచి సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

-

ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్‌ – దానాపూర్‌ల మధ్య ఏప్రిల్‌, మే నెలల్లో అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి జూన్‌ 29వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌-దానాపూర్‌ రైలు ప్రతి గురువారం బయల్దేరగా.. దానాపూర్‌-సికింద్రాబాద్‌ రైలు ప్రతి శనివారం తిరుగు ప్రయాణం అవుతుందని పేర్కొంది. రిజర్వేషన్‌తో నిమిత్తం లేకుండా అప్పటికప్పుడు టికెట్‌ కొనుక్కుని రైలు ఎక్కేలా ద.మ.రైల్వే అవకాశం కల్పిస్తోంది.

మరోవైపు కాచిగూడ నుంచి కొచువెళికి ఏప్రిల్‌ 18, 25 తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. తిరుగు ప్రయాణం కొచువెళి నుంచి కాచిగూడకు ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో రైళ్లు బయల్దేరి.. షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్‌ నుంచి సంత్రాగచ్చికి ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి మంగళ, శనివారాల్లో, సంత్రగాచ్చి నుంచి సికింద్రాబాద్‌కు ఏప్రిల్‌ 21 నుంచి జూన్‌ 30 వరకు ప్రతి బుధ, ఆదివారాల్లో ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news