ఎన్నికల నిర్వహణ పవిత్రతతో ఉండాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగే విధంగా చూడాలని అందుకు చర్యలని వివరించాలని కోరుతూ సుప్రీంకోర్టు భారత్ ఎన్నికల సంఘానికి తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రగా ఉండాలని. ఆశించిన విధంగా జరగడంలేదని ఎవరు ఆందోళన చెందకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపంకర్ దత్త చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ లో ఈవీఎం ఓట్లతో వివి పేట్ స్లిప్పులని క్రాస్ వెరిఫై చేయాలని కోరుతూ దాఖలైన సుప్రీంకోర్టు మరోసారి గురువారం నాడు విచారణ చేపట్టింది.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై ఆరా తీసింది. ఓటరు ఓటు వేసిన తర్వాత వివి ప్యాట్ స్లిప్ తీసుకుని బ్యాలెట్ బాక్స్ లో జమ చేయడానికి అనుమతించాలని అన్నారు ఇంకో పిటిషన్ పై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ తరుపు సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ వాదనలు వినిపిస్తూ కేరళలో జరిగిన మాక్‌పోల్ గురించి కోర్టుకి వివరించారు ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.