త్వరలోనే బీజేపీలోకి ఎంపీ వెంకటేశ్ నేత..?

-

లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు మరో పార్టీలో దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత త్వరలోనే బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.

 

 

కాంగ్రెస్‌ నుంచి గడ్డం వంశీకృష్ణ ఈ స్థానంలో పోటీలో నిలిచారు. మరోవైపు పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో వంశీకృష్ణ గెలుపు చాలా సులభమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ ఇప్పటికే గోమాసె శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించింది. అయితే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో గెలుపు కాస్త కష్టమని భావించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దీటైన వ్యక్తిని బరిలో నిలపాలని యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్‌షా ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు వెంకటేశ్‌ నేత పేరును సూచించగా.. షా వెంకటేశ్ ను నామినేషన్‌ వేసేందుకు రెడీగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news