చిలుకూరు ఆలయం కీలక నిర్ణయం.. రేపు జరగాల్సిన ‘వివాహ ప్రాప్తి’ రద్దు

-

హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం గురించి తెలియని వారుండరు. ఈ ఆలయంలో ఏం మొక్కుకున్నా తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారు వీసా కావాలని ఇక్కడికి వచ్చి వేంకటేశ్వర ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఈ ఆలయంలో జరిగే వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కోసం జరిగే కార్యక్రమాలు చాలా ప్రాశస్త్యం కలిగినవి. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

ఆదివారం రోజున కూడా చిలుకూరు బాలాజీ ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించారు, అయితే తాజాగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రధాన అర్చకులు రంగరాజన్‌ ప్రకటించారు.  శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news