టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరపున ఆయన బరిలోకి దిగారు. బాలకృష్ణ కోసం ఆయన భార్య వసుంధర కూడా ప్రచారం చేస్తున్నారు.
అయితే తాజాగా బాలయ్య గురించి తారకరత్న భార్య అలేఖ్య ఓ ఆసక్తికర పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పటికే అలేఖ్య తన మావయ్య బాలయ్యపై అనేక సార్లు అభిమానాన్ని చూపించారు. ఎన్నికల వేళ మరోసారి అలేఖ్య పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. “నన్ను ఎప్పుడూ అందరూ ఎటు వైపు ఉంటానని అడుగుతున్నారు. తాను ఎప్పుడూ ప్రేమ, మానవత్వం, ముఖ్యంగా కుటుంబం వైపే ఉంటాను. మావయ్య (బాలకృష్ణ) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాం” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.