మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన

-

పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2016లో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. కొంత వరకు బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అయితే మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.

బ్రిడ్జి నిర్మాణం పెండింగ్లో ఉండటంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న ఈ వంతెన అర్ధరాత్రి సమయంలో కుప్పకూలింది. రాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈదురుగాలులకే వంతెన కూలడంతో వంతెన నిర్మాణం నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news