కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పాలిటిక్స్.. అసక్తిరేపుతున్నాయి. నామినేషన్ల కు రేపే ఆఖరి రోజు… ఇంకా అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్ అధిష్టానం. రెండు రోజులక్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు వెలిచాల రాజేందర్ రావు. ఇక రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు పాల్గొన్నారు.
నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు మరో ఆశావహుడు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. అంతేకాదు.. ఇప్పటికే ప్రవీణ్ రెడ్డి తరుపున నామినేషన్ వేశారు ప్రవీణ్ రెడ్డి అనుచరులు. అటు నేడు బీ ఫారం లు ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ నాయకత్వం. దంతో కాంగ్రెస్ ఆభ్యర్థిత్వం ధీమాగా రాజేందర్ రావు,ప్రవీణ్ రెడ్డి ఉన్నారు. అటు ఇప్పటికే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు రాజేందర్ రావు.