తెలంగాణ ఇంటర్ మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకున్నారా?.. ఇక్కడ క్లిక్ చేయండి

-

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.81 లక్షల మందికి పైగా పరీక్ష రాయగా ప్రథమ ఇంటర్‌లో 60.01%, ద్వితీయ ఇంటర్‌లో 64.19% చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజాలు బుధవారం రోజునన ఇంటర్‌ విద్యామండలికార్యాలయంలో విడుదల చేశారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి (71.7 శాతం), మేడ్చల్‌ (71.58 శాతం), ములుగు (70.01 శాతం) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. రెండో సంవత్సరం ఫలితాల్లో ములుగు (82.95 శాతం), మేడ్చల్‌ (79.31 శాతం), రంగారెడ్డి (77.63 శాతం) జిల్లాలు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ మూడు జిల్లాలే తొలి మూడు స్థానాల్లో నిలవడం విశేషం.

అయితే, ఇంటర్‌ బోర్డు అధికారులు విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా మెమోను సులువుగా పొందొచ్చని తెలిపారు. వీటిలో విద్యార్థి పేరు ఫొటోతో పాటు తల్లిదండ్రుల పేర్లు, సాధించిన గ్రేడ్‌, మార్కుల వివరాలను పొందుపరిచారు. ఈ :: Memo Download :::: (cgg.gov.in) లింక్‌పై క్లిక్‌ చేసి మీ మార్కుల మెమోలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news