బుడ్డోడికి కేసీఆర్ హైఫై.. బస్సు యాత్రలో క్యూట్ సీన్

-

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత బుధవారం రోజున బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదట తెలంగాణ భవన్ నుంచి ఆయన నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడ చేరుకునే వరుక మార్గమధ్యలో ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పట్టారు. ఆయణ్ను చూసేందుకు బస్సు వద్దకు వచ్చారు. అలా కేసీఆర్ను చూసేందుకు వచ్చిన ఓ బుడ్డోడు ఆయణ్ను ముట్టుకునేందుకు తెగ ఆరాటపడ్డాడు.

తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు కేసీఆర్ అభివాదం చేశారు. అందరికీ నమస్కరిస్తూ వారి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. బస్సులో నుంచే అందరికి అభివాదం చేశారు. అలా బిజీగా ఉన్న కేసీఆర్ను కలిసేందుకు ఓ బుడ్డుడో వచ్చాడు. కేసీఆర్ సార్.. కేసీఆర్ సార్ అంటూ ఆ బస్సు విండో గ్లాస్ను కొడుతున్నాడు. అది గమనించిన కేసీఆర్ ఆ బుడ్డోడికి హైఫై ఇచ్చారు. ఇక ఆ పిల్లోడి ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్యూట్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news