కాంగ్రెస్ కి ఓటు వేస్తే హిందూ మహిళలందరికీ ప్రమాదం: ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్

-

కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓట్లు వేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడడం కచ్చితం అన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లుని తమ బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తే దానిని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని అన్నారు.

తాము ఈ ప్రస్తావన తెచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తోందని అన్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓటు వేస్తే హిందూ మహిళలు ఆత్మగౌరవాన్ని భద్రతని కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు. దేశంలో జరిగే ఎన్నికలకు మహిళ ఓటు బ్యాంకు కీలకమని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భవితవ్యాన్ని నిర్దేశించేది మహిళా ఓటర్లేనని ఆయన అన్నారు. బిజెపికి మహిళా మోర్చా తరపున పెద్ద ఎత్తున మహిళలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news