నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసేలా మేనిఫెస్టో : కారుమూరి వెంకట నాగేశ్వరరావు

-

ఈ రోజు ఉదయం వైసీపీ తన మేనిఫెస్టోనురిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

ఇక ఈ మేనిఫెస్టో లోని అంశాలపై కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పందిస్తూ…నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసే విధంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారని మంత్రి కారుమూరి కొనియాడారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ..ప్రతిపక్షాలు సైతం ముక్కు మీద వేలేసుకునేలా ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని అన్నారు. దేశంలోనే ఏ జాతీయ పార్టీ కూడా ఈ స్థాయిలో మేనిఫెస్టో పెట్టలేదని.. మన పార్టీ గతంలో విడుదలన చేసిన మేనిఫెస్టో వందకి 99% పూర్తి చేసామని ఆయన తెలిపారు. ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టో కూడా 100కు 100% పూర్తి చేస్తామని పేర్కొన్నారు. టీడీపీ మేనిఫెస్టోలాగా వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించే పరిస్థితి మాది కాదని అన్నారు. మాటిచ్చామంటే చేస్తామని, గతంలో మన మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేశామని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news