యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఆల్ రౌండర్ గా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో 2011 ప్రపంచ కప్ ను ఇండియా కు అందించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని లీగుల్లో మాత్రమే కనిపిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదిలా ఉంటే….ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్‌ను ఐసీసీ నియమించింది.
కాగా, టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పాల్గొనడంపై ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా యూవి కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు. “ఈ ప్రపంచకప్‌లో ఓవర్‌లో 6 సిక్సర్లు ఎవరు కొట్టగలరు..?” అని ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన యువరాజ్ సింగ్ ని ప్రశ్నించారు. దానికి యువీ బదులిస్తూ.., “హార్దిక్ పాండ్యాకు ఆ సామర్థ్యం ఉందని నేను భావిస్తున్నాను” అని అభిప్రాయపడ్డారు.హార్దిక్ ప్రపంచకప్ జట్టులో ఉండగలడా..? లేదా..? అనే అనుమానం ఉన్న సమయలో ఇప్పుడు తాజాగా యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.