రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

-

రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఆయన మాట్లాడుతూ…. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమంటూ ఓ వీడియో సోషల్ మీడియా వైరల్‌ అవుతోందన్నారు.

సంఘ్ పరివార్ మొదటి నుంచి రాజ్యాంగం నిర్దేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దతిచ్చిందని ఆయన అన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనని చెప్పారు.

సమాజంలో బేధ భావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడాలని ఆయన హితవు పలికారు.

ప్రధాని మోదీ మళ్లీ పీఎం అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనికి ఇవాళ మోహన్ భగవత్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news