ఇండియా చైనా మధ్య చర్చలు సజావుగా సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారత్ ఎప్పటికీ తలవంచదని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు అహ్మదాబాద్ లో ప్రచారానికి వెళ్లిన రాజ్నాథ్ సింగ్ సైనిక పరంగా భారత్ శక్తివంతమైన దేశంగా మారిందని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇండియా ఇక మీదట బలహీనమైన దేశం కాదని అన్నారు ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చైనా దురాక్రమణ గురించి మోడీపై చేసిన ఆరోపణల నేపద్యంలో రాజ్ నాధ్ ఇలా చెప్పారు భారత్ చైనాల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ చర్చలు సజావుగా మంచి వాతావరణం లో కొనసాగుతున్నాయని అన్నారు. అయితే భారత్ ఎప్పటికీ తలవంచదు ఈ విషయంలో తాను దేశ ప్రజలకి భరోసిస్తున్నానని రాజ్నాథ్ సింగ్ అన్నారు.