రిజర్వేషన్లు అమలు చేయకుండా ఆ జాతుల కళ్ళల్లో కాంగ్రెస్ మట్టి కొట్టింది : ఈటల రాజేందర్

-

కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓబీసీ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఈటల రాజేందర్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అని చెప్తున్నాడు.. ఖబర్దార్ ఏది నోటికి వస్తే అది మాట్లాడవద్దు. ఏదిపడితే అది మాట్లాడితే చెల్లదు అని వార్నింగ్ ఇచ్చారు .అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నావు.. కేర్ ఫుల్ గా ఉండు. కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయు అని ఈటెల రాజేందర్ హెచ్చరించారు.ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ అమలుచేస్తా అని మోదీ చెప్తుంటే మీరు చేసే విమర్శలు ప్రజలు నమ్మరు… మాదిగలకు న్యాయం చేసి తీరుతాం అని అన్నారు. కేంద్రమంత్రివర్గంలో 27 మంది ఒబిసి మంత్రులు ఉన్నారు.. దమ్ముంటే చర్చకు రండి.12 మంది దళిత, 8 మంది గిరిజన, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్న ఏకైక మంత్రివర్గం మోదీగారిది అని తెలిపారు.. వందసంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఏనాడన్న ఈ వర్గాలకు అవకాశం ఇచ్చిందా…చర్చకు రావాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మైనారిటీ బిడ్డ అబ్దుల్ కలాం, దళితబిడ్డ రామనాథ్ కోవింద్, ఆదివాసీ బిడ్డ ముర్ము గారిని రాష్ట్రపతిని చేసిన బిజెపి గురించా బిడ్డ నువ్వు మాట్లాడేది అని ధ్వజమెత్తారు. సామాజిక సమతుల్యత పాటిస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా. ఓబీసీ ని ప్రధాని చేసిన పార్టీ మాది అని ప్రశ్నించారు. నాలుకకు నరం లేనట్టు మాట్లాడితే నడవదు అని వార్నింగ్ ఇచ్చారు .

కేసీఆర్.. అక్షింతలు పంచితే, జైశ్రీరామ్ అని మాట్లాడితే కడుపునిందుతుందా అని అడుగుతున్నారు. హిందూ గాళ్లు బొందు గాళ్లు అని మాట్లాడితే కర్రు కాల్చి వాతపెట్టారు. ముఖాలు చూసి పదవులు హామీలు ఇచ్చేది మీరు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మా నినాదం. మీవి కుటుంబ పార్టీలు అయితే చాయ్ అమ్ముకునే వాణ్ణి ప్రధాని చేసిన ఘనత బీజేపీది. చత్తీస్ ఘడ్ లో గిరిజనున్ని, మధ్యప్రదేశ్ లో ఓబీసీ ని సీఎం చేసిన పార్టీ బీజేపీ. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఆ జాతుల కళ్ళల్లో మట్టికొట్టిన పార్టీ కాంగ్రెస్ అని , మీరా మా గురించి మాట్లాడేది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ రాష్ట్రంలో ఒక్క ఓబీసీ అయినా సీఎం అయ్యారా? ఈ జాతుల్లో తెలివైన వారు లేరా ? అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నావు.. కేర్ ఫుల్ గా ఉండు. కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయు అని వార్నింగ్ ఇచ్చారు .

 

Read more RELATED
Recommended to you

Latest news