IPL 2024 : రాణించిన సాయి సుదర్శన్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 45 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక తొలుత బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్స్ దారుణంగా నిరాశపరిచారు. గుజరాత్ కెప్టెన్ గిల్ 19 బంతుల్లో 16 పరుగులు, సాహా 4 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు.

ఆ తర్వాత సాయి సుదర్శన్ ,షారుఖాన్ కలిసి మూడో వికెట్ కి 86 పరుగులు జోడించారు.సాయి సుదర్శన్ (84),షారుఖ్ ఖాన్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీంతో ప్రత్యర్థి ముందు 201 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ నిర్దేశించింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో సిరాజ్ , స్వప్ని ల్ సింగ్ మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.ప్లేఆఫ్స్ రేసు అవకాశాలు నిలుపుకోవాలంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news