2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఓడించలేదని తమని తామే ఓడించుకున్నామని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని తెలిపారు.
దీంతో పాటుగా.. బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా అడ్డుకోగలుతామని స్పష్టం చేశారు. అలాగే..డీలిమిటేషన్ లో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.12 లోక్ సభ స్థానాల్లో గెలిపిస్తే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకొగలగుతామని కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ తెలిపారు.