ఇండియా కూటమి మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శల గుప్పించారు. పొరపాటున దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రధాని పదవి కోసం కూటమిలోని అగ్ర నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుందని అన్నారు. స్టాలిన్, శరత్ పవార్, లాలు ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ వంటి నాయకులు ఒక్కొక్కరు ఏడాది ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉందని అన్నారు.
బీహార్ లోని సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు ఇలా ఈ విధంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవి కోసం కూటమిలోని అగ్ర నాయకులందరూ గొడవపడతారని జోస్యం చెప్పారు ప్రతిపక్ష కూటమిలో నాయకత్వ లోపం స్పష్టంగా వుంది అని అన్నారు మోడీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు భారత్ బలమైన ప్రధానిని కోరుకుంటుంది అని అన్నారు.