ఏపీలో ఎన్నికలకి 12 రోజులే ఉంది. ఇక పార్టీలు ప్రచారంతో దూసుకు వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం లో భాగంగా గణపవరం సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం జగన్ మీద సంచలన ఆరోపణలు చేశారు. స్కూల్లో పిల్లలకి ఇచ్చే పుస్తకాలు మీద జగన్ ఫోటో పెట్టడం ఏమిటి అని అడిగారు. ఐదేళ్ల నుండి బెల్ మీద ఉన్న వ్యక్తి బొమ్మ పుస్తకాల మీద పెట్టడం ఏంటని జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేసారని అన్నారు.
పిల్లలకి చెక్కి కవర్ల మీద 67 కోట్ల కొట్టేశారు జగన్ విమర్శించారు పవన్ కళ్యాణ్. ఆయన హయాంలో పేకాటక క్లబ్బులు మద్యం ఇసుక దోపిడీలు ఉన్నాయని అన్నారు వైసిపి ఓటమి తథ్యం అని చెప్పారు. అసెంబ్లీలో అడుగుపెట్టగానే ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ సమస్యకి పరిష్కారం చూపిస్తానని జనసేన అధినేత హామీ ఇచ్చారు.