మండుతున్న ఎండలు.. వాహనదారుల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్

-

రోజురోజుకూ సూర్యుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట అడుగుపెట్టడం లేదు. సూర్యుడి ప్రతాపానికి పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితిలో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. అందుకే ఇలా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారికోసం పుదుచ్చేరి సర్కారు ఓ చల్లటి ఆలోచన చేసింది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బందిపడకుండా ఉండేందుకు గ్రీన్‌ నెట్స్‌తో పందిళ్లు ఏర్పాట్లు చేసింది.

రాష్ట్ర ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సిగ్నళ్ల వద్ద కొంత దూరం వరకు ఈ గ్రీన్‌ షేడ్‌ నెట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సూర్యుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేలా పుదుచ్చేరి అధికారులు చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news