Khammam: కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ పోరు.. ఇరువర్గాల మధ్య తోపులాట

-

కాంగ్రెస్ పార్టీలో భగ్గుమంది వర్గపొరు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి…కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

Divided factions in the Congress party

అయితే.. ఈ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రచారంలో సుబ్లేడ్ గ్రామానికి చెందిన రామ సహాయం నరేష్ రెడ్డి ప్రసంగించవద్దని బీరోలు గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి అనుచరులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పారు. అయితే… నరేష్ రెడ్డి ప్రసంగిస్తే మండలంలో ఓట్లు పడవని, అతన్ని దూరం పెట్టాలని చెప్పడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాగా… ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రామ సహాయం రఘురాంరెడ్డిను అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news