70 ఏళ్ల బామ్మగా సమంత..!

-

అక్కినేని కోడలిగా కొత్త బాధ్యత మీద వేసుకున్న సమంత సాధ్యమైనంత వరకు కమర్షియల్ సినిమాల నుండి తప్పుకుంటుంది. ఈమధ్య వచ్చిన యూటర్న్ ఆమెలోని కొత్త కోణం చూపించింది. యూటర్న్ సినిమాలో సమంత నటనకు మంచి ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇప్పుడు అదే దారిలో ఇంకో ప్రయోగాత్మక సినిమా చేసేందుకు రంగం సిద్ధమైంది. సురేష్ బాబు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

70 ఏళ్ల మిస్ గ్రానీ పాత్రలో నటిస్తుందట సమంత. కొరియన్ సూపర్ హిట్ మూవీ మిస్ గ్రానీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు సురేష్ బాబు. ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఫీమేల్ లీడ్ సినిమాగా వస్తున్న మిస్ గ్రానీలో సమంత 70 ఏళ్ల బామ్మగా.. 25 ఏళ్ల పడుచు పిల్లగా రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తుందట.

ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చుకుని సినిమా తీస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు. మరి మిస్ గ్రానీగా సమంత ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news