ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు.. నెట్‌వర్క్ ఆస్పత్రుల కీలక ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే, మరోవైపు ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది.ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి.

గత ఆరు నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు లేఖ రాశాయి. మే 4 నుంచి నగదు రహిత చికిత్సలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశాయి.కాగా, ఆరోగ్యశ్రీ చికిత్సల ఫీజుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతోపాటు, పదేళ్లుగా ప్యాకేజీ ధరలు పెంచక పోవడం పట్ల ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news