జూన్ 2 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. జట్టు ఎంపికపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.శివమ్ దూబే భయం లేకుండా ఆడతాడు కాబట్టే అతన్ని వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘మిడిల్ ఆర్డర్లో భయం లేకుండా షాట్లు ఆడే ప్లేయర్ కోసం చూశాం. అందుకే దూబేను సెలక్ట్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు అతడికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. వరల్డ్ కప్ లో హార్దిక్, దూబే బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు.
కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. టీ 20 వరల్డ్ కప్ కి పంత్, శాంసన్ ఇద్దరిలో ఎవ్వరినీ ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. ఇద్దరినీ ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక కే.ఎల్. రాహుల్ కు మాత్రం బీసీసీఐ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రిజర్వు ప్లేయర్ గా ఎంపికవుతాడనుకున్న రాహుల్ ని ఎంపిక చేయకపోవడం గమనార్హం.