ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని….కేటీఆర్ ఫైర్ అయ్యారు. నేను చూపించిన చాట్ కానీ.. నేను చెప్పింది కానీ తప్పని రుజువు చేస్తే చంచల్ గూడ జైలుకు పోవడానికి నేను రెడీ అంటూ సవాల్ చేశారు.
కానీ నేను పెట్టింది రైట్ అయితే అదే చంచల్ గూడ జైలుకు ముఖ్యమంత్రిని పంపాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేశాడని ఫైర్అయ్యారు.
రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా నుండి మే 12 2023 తేదీన ఓయూలో నీటి కొరత, విద్యుత్ కోతలు ఉన్నందున క్యాంపస్‌కి సెలవు ప్రకటిస్తున్నామని ఒక ఫోర్జరీ చేసిన ఫేక్ డాక్యుమెంట్‌ని పోస్ట్ చేసాడని వివరించారు. కానీ ఓయూ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో మే 12 2023 తేదీన వచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్లో సమ్మర్ వెకేషన్ మీద యూనివర్సిటీ విద్యార్థులకు హాలిడేస్ ఇస్తున్నామని ఉందని తెలిపారు కేటీఆర్.