నేటి నుంచి పోస్టల్‌ ఓటు, ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

-

కేంద్ర ఎన్నికల సంఘం లోకసభ ఎన్నికల్లో మొదటి సారిగా ప్రవేశపెట్టిన ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 85 ఏళ్ల పైపడిన వృద్ధులు, 40శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఇంటి నుంచి ఓటు వేసేందుకు నమోదు చేసుకున్న అర్హులైన ఓటర్ల గుర్తించిన అధికారులు.. ఏ రోజు వారి ఇంటికి వస్తారో బూత్ స్థాయి అధికారి ద్వారా సమాచారం అందిస్తారు. నిర్ణీత తేదిన పీఓ, ఏపీఓ, సూక్ష్మ పరిశీలకులు, పోలీసు సిబ్బంది, రూట్ ఆఫీసర్ , బీఎల్ఓ, వీడియో గ్రాఫర్ తో కూడిన బృందం ఓటర్ ఇంటికి చేరుకుంటుంది. గుర్తింపు కార్డు సహా అన్ని వివరాలు సరి చూసుకుని ఓటరు కు బ్యాలెట్ అందిస్తారు. గోప్యంగా, సురక్షితంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తారు.

ఓటు వేసిన బ్యాలెట్ ను పెట్టెలో వేయించి.. ఆ పెట్టెను తిరిగి సంబంధింత అధికారులకు..అప్పగిస్తారు. మూడో తేది నుంచి ఆరో తేది వరకూ ఓటరు ఇంటికి అధికారుల బృందం వచ్చినా.. అనివార్య కారణాల వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేక పోతే.. 8తేది లోపు మరోసారి అవకాశం కల్పిస్తారు. అలా 8వ తేది లోపు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news