హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమై ఆరున్నరేళ్లు అయింది. ఈ ఆరున్నరేళ్ల కాలంలో మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం రోజూ సగటున 5 లక్షల ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చారిత్రకమైలుని చేరుకున్న దృష్ట్యా కస్టమర్, గ్రీన్‌మైల్ లాయల్టీ క్లబ్‌ను ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఈరోజు ప్రారంభించనుంది.
హైదరాబాద్‌లో మెట్రో రైలును 2017 నవంబరు 29న ప్రారంభించగా.. తొలుత మియాపూర్ నుంచి అమీర్‌పేట- నాగోల్ మార్గంలో సేవలు మొదలైంది. 5 దశల్లో పూర్తిగా 69.2 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. కారిడార్-1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో రెండున్నర లక్షల మంది నిత్యం ప్రయాణిస్తుండగా.. ఇదే స్థాయిలో కారిడార్-3 నాగోల్ నుంచి రాయదుర్గంలో రష్ ఎక్కువగా ఉంటుంది. కారిడార్-2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు సగం మాత్రమే ఆపరేషన్‌లోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉంది. ఉదయం, సాయంత్రం మెట్రో రైళ్లు చాలక ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా మెట్రో రైళ్లు లేకపోవడమే దీనికి కారణం.