నిర్భ‌య కేసులో కొత్త మ‌లుపు.. ధర్మాసనం నుంచీ..

-

దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషి అక్షయ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ కొత్త మలుపు తిరిగింది. దోషుల్లో ఒకరైన అక్షయ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే తప్పుకున్నారు. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన ఈ మేరకు నిర్ణయించుకోవడంతో ఈ కేసు తాత్కాలికంగా వాయిదా పడింది. బాధితురాలి తరపున ఈ కేసులో ఒకప్పుడు తన బంధువు వాదించినందున ఈ కేసులో తాను తీర్పు ఇవ్వలేనని సీజే పేర్కొన్నారు.

బుధవారం 10:30 గంటలకు ఈ కేసుపై మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తానని.. అక్షయ్ కుమార్ రివ్యూ పిటిషన్‌పై నూతన బెంచ్ విచారణ జరుపుతుందని ఆయన తెలిపారు. కాగా 2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో తనకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news