కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వాహనం ఢీకొని మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించారు నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…..కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వాహనం ఢీకొని పబ్బతి నరేష్, బైరపాక పరుశరాములు మృతి చెందారన్నారు.
వాళ్ల మృతదేహాలను ఫ్రీజర్లలో పెట్టే వసతులు కూడా కల్వకుర్తి హాస్పిటల్లో లేవని ఫైర్ అయ్యారు. పేదవాళ్లంటే ఇంత చిన్న చూపా? ప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బాధితుల పిల్లలను కసిరెడ్డి నారాయణరెడ్డి తన అసెంబ్లీ నిధుల నుండి చదివించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.