కాఫీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ధర..!

-

కాఫీ ప్రియులకు చేదు వార్త. రాబోయే రోజుల్లో కాఫీ మీ పెదాలను కాల్చేసే అవకాశం ఉంది. అంటే ఉదయం తాగే కాఫీ ధర పెరుగుతుంది. ప్రస్తుతం సాధారణ హోటళ్లలో 15 నుంచి 20 రూ. కొన్ని హైటెక్ హోటళ్లలో 40 నుండి 100 రూ. స్పెషాలిటీ కాఫీ పార్లర్లలో 80 నుండి 800 రూపాయలుగా కప్పు కాఫీ ధర ఉంది. ఈ ధరలు కొద్ది రోజుల్లో కనీసం 5-10 నుండి 30-40 రూపాయల పెరుగుదల చూపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నాణ్యమైన కాఫీ తాగాలంటే కాస్త ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది.

ప్రతికూల వాతావరణం కారణంగా, బ్రెజిల్ – వియత్నాం వంటి ప్రధాన కాఫీ ఉత్పత్తి దేశాలు ఆశించిన కాఫీని ఉత్పత్తి చేయలేకపోయాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కాఫీ కొరత ఏర్పడింది. దీంతో ఇండియన్ కాఫీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే దేశం నుంచి విదేశాలకు 40 వేల 434 మెట్రిక్ టన్నుల కాఫీ ఎగుమతి అయినట్లు కాఫీ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి.ఏప్రిల్ నెలలో మూడు, నాలుగు సార్లు కాఫీ గింజల ధరలు పెరిగాయని.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కాఫీ పౌడర్ విక్రయదారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news