అబద్ధాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి

-

జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ వైసీపీ నాయకులు, ఎన్టీఆర్ సతీమణి లక్షీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలో లక్షీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకు పడ్డారు.

అబ్బద్దాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘటన ఆయనకే దక్కిందన్నారు లక్షీపార్వతి. పవన్ కల్యాణ్ కపటంలేని మంచి మనిషి అని అలాంటి వ్యక్తి చంద్రబాబును నమ్మి మోసం పోతున్నాడని అన్నారు. పిఠాపురంలో కాపులంతా ఐక్యం కావాలని, భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతను అసెంబ్లీకి పంపాలని ఆమె పిలుపునిచ్చారు. పవన్ పిఠాపురానికి వలస వచ్చాడని.. నిరంతంరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు వంగగీతకే ఓటు వేయాలంటూ కోరారు.

.

Read more RELATED
Recommended to you

Latest news