అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సే :రాజస్థాన్ సీఎం

-

అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు, సోషల్ మీడియా బృందంతో మంగళవారం సమావేశం నిర్వహించారు.కాగా ఈ సమావేశానికి రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ,రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ హాజరయ్యారు.

ఎన్నికల సమాయత్తం, బూత్ కమిటీలు, బూత్ స్థాయిలో చేయాల్సిన పనులపై సమీక్ష అనంతరం భజన్ లాల్ శర్మ మీడియాతో మాట్లాడారు. యూపీఏ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సేనని ఆయన మండిపడ్డారు. జూన్ 4న కాంగ్రెస్ సహా విపక్ష కూటమి నేతలకు ఓటమి తప్పదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news