హైదరాబాద్ లో వర్షం పడుతుంటే..ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్ మేయర్ !

-

హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రికార్డు స్థాయిలో వాన పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం భాగ్యనగరంలో బీభత్సం సృష్టించింది. రికార్డుస్థాయి వ‌ర్షానికి నగరంలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఇక రహదారులపైకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

చాలా చోట్లు చెట్లు విరగడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌ ప్రజలు చాలా తిప్పలు పడుతున్నారు. ఈ తరుణంలోనే… హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మీకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌ గా మారింది. సోషల్ మీడియాలో హైదరాబాద్ మేయర్ వీడియో చక్కర్లు కొడుతోంది. భారీ వర్షానికి నగరం కుదేలయితే మేడం ఇంట్లో పెట్స్ తో సేదతీరుతున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు హైదరాబాద్‌ నగర వాసులు.
అయితే.. ఈ వీడియో పాతది అంటూ ఖండించారు మేయర్ విజయలక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news